ఇష్క్ నాకు నచ్చింది

జయం నుండి శ్రీఆంజనేయం వరకూ సున్నితమైనవి / లవర్ బోయ్ తరహా పాత్రలు ధరిస్తూ కొంతలో కొంత సక్సెస్ అవుతూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న నితిన్ ఆపై చాలామంది కుర్రహీరోల్లానే ఒక మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఫైట్లు గట్రాలతో మాస్ కథలతో తీసిన డజను చిత్రాలతో పరాజయాలనెదుర్కొని, నితిన్ సినిమా  అంటేనే ప్రేక్షకులు ఆమడదూరం పారిపోయేలా చేసుకున్నాడు. ఆతర్వాత మెల్లగా కళ్ళుతెరచి తిరిగి తనకు అచ్చొచ్చిన లవర్ బోయ్ రోల్ లో స్క్రీన్ ప్లేని నమ్ముకుని తీసిన చిత్రమే ఇష్క్.

కొత్తదనం నిండిన సన్నివేశాలతో కూడిన ఆకట్టుకునే స్క్రీన్ ప్లే సాధారణమైన ప్రేమకథాచిత్రాన్ని సైతం విజయపథాన ఎలా నడపగలదో చెప్పడానికి ఈచిత్రం ఒక మంచి ఉదాహరణ. దర్శకత్వ ప్రతిభే ఈచిత్రాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఉపయోగపడిందని చెప్పచ్చు. అలా అని ఇది ఒక అద్భుతకళాఖండం నభూతో నభవిష్యత్ లాంటి సినిమా ఏం కాదు ఒక సాధారణమైన ప్రేమకథను కొంచెం కొత్తగా పి.సి.శ్రీరాం అందమైన సినిమాటోగ్రఫీ తోడుగా చెప్పారు. చిత్రం నిడివి కొంచెం ఎక్కువైనాకూడా ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది.

కథ విషయానికి వస్తే పదిమందిని కొట్టిపడేయగలిగిన దమ్ము ఉన్నా కూడా కండబలంకన్నా బుద్దిబలం ఉపయోగించి సమస్యలనుండి బయటపడే తత్వం గలవాడు హీరో రాహుల్(నితిన్). ఒక సాధారణమైన కుర్రాడిగా కనపడిన అమ్మాయికల్లా సైటు కొడుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న మంచిపనులు సైతం చేస్తూ తిరుగుతుంటాడు. అతను డిల్లీనుండి హైదరాబాద్ వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో ప్రియ(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. కొన్ని ఇబ్బందుల వల్ల హైదరాబాద్ వెళ్ళవలసిన విమానం గోవాలో ల్యాండ్ అయి ఒక రోజు ఆలశ్యంగా హైదరాబాద్ వేళ్తుంది. గోవాలో దొరికిన సమయంలో రాహుల్ ఫ్రెండ్ పెళ్ళిలోనూ గోవాలోనూ కలిసి తిరిగిన రాహుల్ ప్రియలు ప్రేమలో పడతారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వాళ్ళకి ప్రియా వాళ్ళ అన్నయ్య శివ(అజయ్)కీ రాహుల్ కూ పాత గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడనుండి రాహుల్ తనబుద్దిబలంతో ప్రియ వాళ్ళ ఇంట్లో ఒప్పించి తనని ఎలా సొంతం చేసుకున్నాడనేది ద్వితీయార్ధంలో తెలిసే కథ.

చిత్రంలో కథకన్నా కథనానికి పెద్దపీట వేశారు. ప్రధమార్ధంలో కొత్తదనం నిండిన ప్రేమ సన్నివేశాలు మంచి డైలాగులతోనూ సునిశితమైన హాస్యంతోనూ ఫ్యామిలీ సెంటిమెంట్ తోనూ నింపి చక్కని ఫీల్ ఇస్తే ద్వితీయార్ధంలో రాహుల్ తెలివితేటలు, శివ లాక్ అయిన విధానం వీటినుండి పుట్టే సున్నితమైన హాస్యం అలరిస్తాయి. అలాగే సినిమాలో కనెక్టింగ్ పాయింట్స్ అంటే రాహుల్ క్యాప్, ప్రియ బ్యాంగిల్స్ పిచ్చి, గోవాలో జరిగే సంఘటనలను ఉపయోగించుకున్న తీరు ఇలాంటి చిన్న చిన్నపాయింట్స్ సైతం మంచి అనుభూతినిచ్చాయి. అలాగే రాహుల్ పేరుతో ఉన్న ఎపిసోడ్, ఛేజ్ లో ఉన్న సున్నితమైన కామెడీ సైతం ఆకట్టుకుంటాయ్.

చిత్రం ఆధ్యంతమూ పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, ఎయిర్ పోర్ట్ లో కొత్తగా ప్రయత్నించిన కెమేరా ప్లేస్మెంట్ ఫ్రేమింగ్ కానీ విమానం టేకాఫ్ ల్యాండింగ్ షాట్స్ కానీ చాలాబాగా వచ్చాయ్, నైట్ ఎఫెక్ట్ లో బీచ్ లో తీసిన ఫైట్, వర్షంలో జీప్ లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నపుడు అజయ్ హావభావాలకు తగినట్లు విండ్ షీల్డ్ మీద పడుతున్న వర్షంలోనుండి తన మొహంపై పడే షేడ్స్ క్యాప్చర్ చేయడంలోకానీ, పాటలలోకానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాటోగ్రఫీ సినిమాలోని ప్రతిప్రేంనూ ఎలివేట్ చేసింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ కూడా చక్కని ప్రతిభ కనపరిచారు. మొదటిలో వచ్చే ప్రేమ సన్నివేశాలలో కొన్ని సార్లు సంభాషణలకన్నా సన్నివేశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు అలాంటి చోట్ల నేపధ్యసంగీతం చక్కగా ఉపయోగపడింది. పాటలలో లచ్చమ్మ పాట పబ్ లో డిస్కో తరహాలో తీశారు అలాంటిపాటలు నచ్చేవారికి ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన పాటలు కూడా సినిమాటోగ్రఫీ వల్ల ప్లేస్మెంట్ వలన మరింత ఆకట్టుకున్నాయి.

నితిన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు, నటనకూడా చాలా మెరుగు పరచుకున్నాడనిపించింది. డాన్సులు సైతం మరీ తీవ్రమైన స్టెప్స్ కోసం ప్రయత్నించి విఫలమవకుండా సింపుల్ స్టెప్స్ తో బాగాచేశాడు. హాస్యసన్నివేశాలలో టైమింగ్ మరికాస్త మెరుగుపరుచుకోవాలికానీ గతచిత్రాలతో పోలిస్తే బాగుంది. నిత్యామీనన్ అలామొదలైంది సినిమానుండి సరాసరి ఈ స్క్రీన్ మీదకి నడిచి వచ్చినట్లు అనిపిస్తుంది. తన డైలాగ్ డెలివరీ, క్యారెక్టరైజేషన్ అంతా దదాపు అదే పాత్రని పోలి ఉంది. కాస్ట్యూంస్ వల్ల అక్కడక్కడ కొంచెం బొద్దుగాకనిపించింది, నటనా, సంభాషణలలో ఎక్కడా వంక పెట్టలేనట్లుగా ఉంది. అజయ్ పాత్ర చాలా ఆకట్టుకుంటుంది ప్రధమార్ధంలో ఎక్కువనిడివిలేకున్నా ద్వితీయార్ధంలో చక్కని నటన చూపించి ఆకట్టుకుంటాడు. మిగిలిన పాత్రలన్నీకూడా తమ పరిధిమేరకు ఆకట్టుకుంటాయి.

కథలో కొత్తదనాన్ని హాలీఉడ్ తరహా చిత్రాలనూ ఆశిస్తూ తెలుగు సినిమా పరిధి పెరగాలని ఆలోచించేవారైతే మీరు ఈ సినిమాకు దూరంగా ఉండటం బెటర్. అలాకాక హింసా రక్తపాతాలకు దూరంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిన్న చిన్న లాజిక్ తప్పులను క్షమించేసి, అందమైన సినిమాటోగ్రఫీనీ, మోతాదు మించని నటనను శృతిమించని సునిశితమైన హాస్యాన్నీ చూసి ఎంజాయ్ చేయగలను అనుకుంటే ఈ సినిమా మీకోసమే. బాక్సాఫీస్ పరంగా యువతను మల్టీప్లెక్స్ ఆడియన్సును టార్గెట్ చేసిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అక్కున చేర్చుకుంటే కనుక గత ఏడేళ్ళుగా ఎండమావుల వెంట పరుగెడుతున్న నితిన్ కు ఒయాసిస్సు దొరికినట్లే.

English1

లారెన్స్ ఆఫ్ అరేబియా (1957)

టీ.ఈ. లారెన్స్ అనే బ్రిటీష్ ఆర్మీ అధికారి చరిత్రనే  Lawrence of Arabia గా 1957 లో తెరకెక్కించారు.యుద్ద కథల మీద వచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రెండవ ప్రపంచ యుద్ద ప్రభావం నుంచీ ప్రపంచం అప్పుడే కోలుకుంటూ ఉండటం, పశ్చిమ దేశాలకు పెద్దగా తెలియని మధ్యప్రాచ్యం యొక్క కథ కావడం ,సహజంగానే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలను కలిగించింది.అంతే కాక, ఏడు ఆస్కార్ అవార్డులు, ఐదు బ్రిటీష్ అకాడెమీ అవార్డులు, [...]

February 16, 2012 7
కలగూరగంప2

ఘంటసాల గారికి శ్రద్ధాంజలి ..

నిన్న11ఫిబ్రవరి, మధుర గాయకుడు ఘంటసాల గారి వర్థంతి. ఆయన పాటలు వింటుంటే చాలా రోజుల క్రిందట నేను విన్న ఆడియోలు గుర్తొచ్చాయి..  ఆ ఆడియోలలో మన తెలుగు చిత్ర ప్రముఖులు మాష్టారితో తమ అనుభంధాన్ని నెమరు వేసుకున్నారు.  అందరు చెప్పింది కాకుండా యన్.టి.ఆర్., ఏ.యన్.ఆర్, బాలమురళీ కృష్ణల శ్ర్ద్ధాంజలి పాఠం ఇక్కడ పెడుతున్నాను.. ఘంటసాల మాష్టారికి యన్.టి.ఆర్ శ్రద్దాంజలి నా పాత్రలన్నిటికి నా నటనతోపాటూ భావావేశపూరితమైన సంగీత సంకలనం తో జీవం ప్రసాదించారు మాష్టారు.. కొన్నింటిని చిరస్మరణీయం [...]

February 12, 2012 2
సమీక్ష3

Business Man నాకెందుకు నచ్చిందంటే..

This movie is strictly “A” Certificate movie and not for under 18. దూకుడు లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత మహేష్ నుండి అలాంటి సినిమానే ఆశిస్తూ పిల్లలు పెద్దలు ఉత్సాహంగా చూసేద్దామని ఎదురు చూస్తున్న టైంలో మహేష్ ఇలాంటి సినిమాను ఎన్నుకోవడం కొంచెం అభ్యంతరకరమైన విషయమే. స్టార్ ఇమేజ్ వచ్చాక నటులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది చిత్రాల ఎంపిక విషయంలో ఎలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నాం అనే విషయంపై శ్రద్ద [...]

January 18, 2012 10
కలగూరగంప4

శ్రీశ్రీ సినీ ప్రస్థానం

శ్రీశ్రీ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యడం అంటే అది ఆయన్ను అవహేళన చేయడమే!! ఎందుకంటే శ్రీశ్రీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి; ఒక జాతిని జాగృతం చేయడానికి కలాన్ని కరవాలంగా ఉపయోగించిన  ప్రచండ శక్తి; శ్రీశ్రీ గారి 102వ జయంతి సందర్భంగా ప్రచురిస్తున్న ఈ వ్యాసం ఆయన సినీ సాహిత్య ప్రయాణం వరకూ పరిమితం చేస్తున్నాను. 1950లో “నీరా ఔర్ నందా” అనే హింది చిత్రం తెలుగు “ఆహుతి” అనే పేరుతో అనువదించారు. [...]

January 2, 2012 2
సమీక్ష5

అదరని పెను ధైర్యమే పంజా !!

తనకి చిన్న వయసులో సాయం చేసిన ఓ డాన్ ఋణం తీర్చుకోడానికి తన స్వభావానికి విరుద్ధంగా అతని దళపతిగా ఎదిగి తనకి ఇష్టం లేని పనులు చేస్తూ తన ఇరవైఏళ్ళ జీవితాన్ని పణంగా పెట్టిన ఓ వ్యక్తి అన్నేళ్ళుగా తను అన్వేషిస్తున్న ప్రేమను చవిచూసిన తర్వాత తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలియ జెప్పే కథే పంజా. పవన్ లవర్ బోయ్ గా చేసిన తమ్ముడు, ఖుషీ, జల్సా లాంటి సినిమాలను ఆశించి [...]

December 11, 2011 12
కలగూరగంప6

దేవానంద్ ఉన్నారు

సల్మాన్ రష్డీ నుంచీ పూనం పాండే వరకూ, అమితాబ్ బచ్చన్ నుండీ సోనం కపూర్ వరకూ, అందరూ తమ సంతాప సందేశాలు తెలియచేస్తున్నారు, దేవానంద్ ఇక లేరని.. కానీ ఆయన ఉన్నారు.. అవును! ఎవర్ గ్రీన్  యంగ్ మాన్ అనే హోదాలో ఉన్నారు.. Happy go Lucky హీరోలున్న ప్రతి సినిమాలో ఉన్నారు.. కోట్లమంది అభిమానుల హృదయాలలో తిష్ఠ వేసుకుని మరీ ఉన్నారు.. 1946 లో మొదలు పెట్టిన సినీ ప్రస్థానం 65ఏళ్ళపాటూ సాగడం బాలివుడ్ చేసుకున్న [...]

December 4, 2011 0
కలగూరగంప7

చట్టానికి కళ్ళులేవు

అక్టోబర్ 30 1981 న విడుదలైన ఈ చిత్రం ప్రజలకు చేరువై ఇటీవల ముఫ్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఈ పరిచయం. తెలుగు సినిమాలలో మనం సాధారణంగా గమనించే ఒక విషయం హీరో ఎప్పుడూ మంచి వాడై చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండి విలన్ల ఆటకట్టిస్తుంటాడు. విలన్ అనేవాడు మాత్రమే ఈ చట్టాలని అతిక్రమించడంలోనూ నేరాలను చేయడంలోను పర్మిషన్ పొంది ఉంటాడు. హాలీఉడ్ సినిమాలలో దొంగతనం చేసిన వాడిని, చట్టాలని అతిక్రమించిన వాడ్ని కూడా ప్రధాన [...]

November 1, 2011 4
సమీక్ష8

పిల్లజమిందార్

కష్టపడకుండా వారసత్వంగా వచ్చే సిరిసంపదలు తెచ్చిపెట్టిన అహంకారం (AKA బలుపు) తల నిండుగా ఎక్కించుకుని భూమికి పాతిక అడుగుల ఎత్తులో తప్ప నడవని ఓ కుర్రాడు తన తాత గారి కండిషన్స్ వలన తప్పనిసరిఐ నేలమీద నడవడం అలవాటు చేసుకుని, జీవితాన్ని మానవతా విలువలని అర్ధం చేసుకుని తనలోని మంచి మనిషిని కప్పి ఉంచిన అహంకారపు పొరలను ఛేదించుకుని పూర్తిమంచివాడుగా మారడమే ’పిల్ల జమిందార్’ కథ. ఈ కథ తెలుగు తెరకు కొత్తకాకపోయినా కామెడీ సెంటిమెంట్ సమపాళ్ళలో [...]

October 15, 2011 4
Page 1 of 1412345»10...Last »

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME