19 Responses to ఆకలిరాజ్యం(1981)

  1. SHANKAR.S says:

    “నిరుద్యోగ సమస్య అయితే అరికట్టబడింది కానీ పేదరికం, ఆకలి చావులు మొదలైన వాటిల్లో పెద్దగా మార్పులేవీ రాలేదనే చెప్పాలి”
    నిరుద్యోగ సమస్య ఇంకా తగ్గలేదండీ. అలాగే ఉంది. కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు ప్రైవేట్ రంగం లో ఉద్యోగాలు పెరగడం వలన అలా అనిపిస్తోంది అంతే. నిరుద్యోగులు ఇప్పటికీ ఉన్నారు.

    “ముగ్గురు స్నేహితులు అన్నం తింటున్నట్లు నటించే సన్నివేశం”
    ఇది నిజం గా కళ్ళు చెమర్చే తెప్పించే హాస్యం

    ఈ చిత్రం లో మరొక ముఖ్యమైన పాత్ర “దిలీప్” (పాత్ర పేరు). ఆ నటుడి పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

    तु है राजा.. मैं हू रानी.. ఈ పాట రాసింది ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు

    ఇంకొక ముఖ్యమయిన శ్రీ శ్రీ కవిత కూటి కోసం కూలి కోసం మర్చిపోయారండీ. ఈ కవితని చిత్రీకరించిన తీరు అద్భుతం

    ఎప్పటిలాగానే మంచి సినిమాకి చక్కని రివ్యూ. మీకు వీరతాళ్ళు :) )

  2. శంకర్ గారూ,
    ఎప్పటిలాగే మీ వ్యాఖ్య కూడా చక్కగా ఉంది.

    కమల్ శ్రీశ్రీ వాక్యాలను ఉదహరించే కొన్ని సన్నివేశాలను క్రింద లింక్లో చూడవచ్చు:

    ఇది ఆర్టికల్ లో రాసానండి. పబ్లిష్ చేసేప్పుడు మిస్సయినట్లుంది.

    Thanks for the comment.

  3. karthik says:

    ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఢిల్లీకి టికెట్ కొన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగే సంభాషణ.. రెండు తరాల మధ్య ఉండే జెనరేషన్ గ్యాప్ ని సూపర్ గా చూపించారు..
    మొత్తంగా చూస్తే 100% బాలచందర్ మార్క్ సినిమా ఇది.. మామూలుగానే ప్రేక్షకులను చాలా సన్నివేశాలలో ఏడిపిస్తాడు..

  4. శంకర్ గారూ
    దిలీప్ గా వేసిన నటుని పేరు ప్రతాప్ పోతన్…చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

  5. SHANKAR.S says:

    అయితే సినిమా మీరు మరో సారి చూడాలి సౌమ్య గారూ :) )

    • వామ్మో, నేను మరచిపోయానా సినిమా! :( ….ఇంతకీ ప్రతాప్ పోతన్ వేసిన పాత్ర పేరేమిటి?

  6. శ్రీనివాస్ పప్పు says:

    @ Shankar garu: ఆ గడ్డాలాడే దిలీప్ అయితే వాడి పేరు త్యాగరాజన్ అనుకుంటా(జీన్స్ సినిమా హీరో ప్రశాంత్ తండ్రి) కానీ ఈ ఇనిమా కేస్టింగ్ లో పేర్లు వేరేగా ఉన్నాయి.(కమల్ హసన్, శ్రీదేవి, ప్రతాప్, దిలీప్, శేఖర్, భరణి, జె.వి.రమణ మూర్తి, కృష్ణారావ్, ప్రతాప్ చంద్ర, జయశ్రీ)

    తృష్ణ గారూ చక్కటి సినిమా కి అతి చక్కటి రివ్యూ

    • Anupama says:

      జీన్స్ లో ప్రశాంత్ తండ్రి నాజర్ కదా?
      బహుశా ఐశ్వర్య తండ్రి అంటున్నట్టున్నారు.
      అలా అయితే నిజమే. అతనే రూపాయ బిళ్ళలు దొరికినట్టు కల కంటాడు సినిమా మొదట్లో..
      నాకు కమల్ కి వారి తండ్రికి జరిగే సంభాషణలు చాలా నచ్చుతాయి అండి..

  7. మంచి సినిమా గురించి చక్కగా రాసారు.

    ఈ సినిమాలో అన్నం తింటున్నట్టు నటించే శీను…విస్తట్లో న్నం ఉన్నా తినే అవకాశం దొరకని సీను…నాకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. పాటలు సరేసరి…చెప్పక్కర్లేదు.

  8. శ్రీనివాస్ పప్పు says:

    “ఈ సినిమాలో అన్నం తింటున్నట్టు నటించే శీను”

    సౌమ్య గారూ ఎవరీ “శీనూ”

  9. SHANKAR.S says:

    అంటే మీరు అప్పట్లో స్టార్ డం అంతా కమల్ హాసన్ కి త్యాగం చేశారు కాబట్టి ఆ సినిమా మీరే చేసి ఉండాల్సిందని సౌమ్య గారి భావనేమో “శీను” అని శ్రీనివాసరావుగారిని కొందరైనా పిలవకపోతారా అని తన భావం :)

    • కెవ్వు కెవ్వు శంకర్ గారూ….ఇరగ భాష్యం చెప్పారు :D :D
      అదే అదే నా ఉద్దేశం అదే పప్పుసారూ…అర్థం చేసుకోరూ! :P

  10. చక్కని సమీక్ష తృష్ణ గారు.. చాలా బాగా రాశారు. ముఖ్యమైన సన్నివేశాలన్నీ మీరు కోట్ చేశారు. నాకు దదాపు అన్ని సన్నివేశాలు దేనికవే హైలైట్ అనిపిస్తాయి. కమల్ కు తన తండ్రికీ మధ్య సన్నివేశాలు అద్భుతం అనిపిస్తాయి… వందరూపాయలు దొరికినపుడు ఒక్కొక్కరు వివిధమాడ్యులేషన్స్ తో ఆనందపడడం దాన్ని ఇంటి ఓనర్ లాక్కున్నపుడు మళ్ళీ అలాగే నిరుత్సాహంతో అసహాయతతో అరవడం కాంగ్రెస్(X) కాంగ్రెస్(Y) జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇవ్వడం.. ఒకటేమిటి పేదరికానికి సంభందించిన ప్రతి సన్నివేశం హృదయాన్ని కదిలించేస్తుంది..

    సంధర్భానుసారంగా కమల్ చెప్పే శ్రీశ్రీ కవితలు చాలా బాగా సరిపోతాయి.. చివరికి శ్రీశ్రీ పుస్తకాలు తూకానికి ఇచ్చేసినపుడు “శ్రీశ్రీ నాకు దైవమే కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దెయ్యం ఆకలి.. The omnipresent and the omnipotent” అంటూ కమల్ చెప్పే డైలాగ్స్ వింటే ఆకలి మీద కోపం, భయం, గౌరవం అన్ని భావాలు ఒకేసారి కలుగుతాయి. శంకర్ గారు అన్నట్లు ప్రైవేట్ అవకాశాల దృష్ట్యా నిరుద్యోగ తీవ్రత తగ్గిందేమో కానీ పూర్తిగా అరికట్టబడలేదండీ.. ఇప్పటికీ ఇలాకష్టపడే నిరుద్యోగులు ఉన్నారు..

    పాటలలో ’కన్నెపిల్లవని’,’ సాపాటు ఎటూ లేదు’ మొదటి స్థానం కోసం పోటీ పడినా.. గుస్సారంగయ్య పాటలో వచ్చే
    “మహాత్ములెందరు సహాయ పడినా మంచి జరగ లేదు.. జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు” లాంటి లైన్స్ కూడా నాకు చాలా ఇష్టం. మీరు వ్యాసాన్ని ముగించిన తీరు బాగుందండి.

    సినిమాలో దిలీప్ అనే క్యారెక్టర్ ఉండదండీ.. బతకనేర్చిన బుద్దిశాలే దిలీప్ అంటూ త్యాగరాజనే తన దొంగ తెలివి తేటలను చలామణి చేయడానికి ఒక పాత్రని సృష్టిస్తాడు. బహుశా త్యాగరాజన్ స్క్రీన్ నేమ్ వేరే ఐ ఉండచ్చు అప్పట్లో.

  11. సౌమ్యగారూ, నాకూ వాళ్ల అసలు పేర్లు సరిగ్గా తెలీవండీ. ఎవరినైనా కనుక్కోవాలి..:) ధన్యవాదాలు.

    కార్తీక్ గారూ, పప్పు శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు.

    వేణూ శ్రీకాంత్ గారూ, సినిమాకు శ్రీశ్రీ గారి కవితలు ఊపిరి అని చెప్పాలేమోనండి. ఈ సినిమా గురించి కథ కన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సినది సన్నివేశాల గురించే..
    వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  12. వేణు says:

    చాలా గొప్ప సినిమా గురించి బాగా రాశారు. అభినందనలు !

    నిరుద్యోగ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని యువకుల దృష్టికోణం నుంచి శక్తిమంతంగా తీసిన ఈ సినిమాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను హైలైట్ చేయటం అర్థవంతంగా ఉంటుంది. 30 ఏళ్ళ కిందటితో పోలిస్తే నిరుద్యోగ సమస్య తీవ్రత కొంతే తగ్గింది. ఉద్యోగ అభద్రత, రిట్రెంచ్ మెంట్ల సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉన్నాయిగా !

    ‘ఆకలి రాజ్యం’ సంభాషణల కర్త గణేశ్ పాత్రో కలం ఈ సినిమాలో కదం తొక్కింది. ముఖ్యంగా కమల్ తన దుస్థితి గురించి చెప్పుకునే సందర్భాల్లో! శ్రీశ్రీ కవితలను సందర్భానుసారంగా కోట్ చేయటం హృద్యంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చినపుడు శ్రీశ్రీ జీవించే ఉన్నారు. ఇక మూగ ఆర్టిస్టు ‘భరణి’ రంగుల ప్రతీకల గురించి వివరించే సన్నివేశం అద్భుతం.

    ‘తూహై రాజా…’ పాటలో గొప్ప సైక‘లాజికల్’ పాయింట్ ఉంది. హిందీ పాట పాడుతూ నర్తించే శ్రీదేవి పాత్ర వేదికపై నుంచి కమల్ ను చూసి తాదాత్మ్యంతో అప్రయత్నంగా మాతృభాషలోకి మళ్ళిపోయి తన భావోద్వేగం వెల్లడిస్తుంది. ‘అందం చందం అనురాగం- ఈ ఆనందం దివ్యభోగం …’ అంటూ! ఈ పాట రాయటానికి దర్శకుడు తనను ఎలా ఎంచుకున్నారనే దాని గురించి పీబీ శ్రీనివాస్ గారిని అడిగి సమాచారం ఇవ్వగలిగితే బాగుంటుంది.

  13. అనుపమ గారూ, missed ur comment y’day.
    ధన్యవాదాలు.

    వేణు గారూ, “తు హై రాజా” పాట గురించి మీరు రాసిన పాయింట్ బాగుంది. ఎవరైనా అలా తెలుసుకుంటే బాగుంటుందండీ..
    ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Subscribe without commenting

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME