ఊసరవెల్లి నాకు నచ్చింది, అవును నిజంగానే నచ్చింది. చాలారోజుల తరువాత కాస్త అర్థవంతమైన సినిమా అనిపించింది. ముఖ్యంగా దూకుడు కంటే ఎంతో ఫరవాలేదనిపించింది. కథ విషయానికొస్తే దందాలు చేస్తూ కావలసిన విధంగా రంగులు మారుస్తూ పని జరిపించుకునే హీరో, చాలా మంచి మనసుతో, ఇతరులకి సహాయం చేసే గొప్ప గుణంతో ఉండే హీరోయిన్. అనుకోని పరిస్థితులలో వీళ్ళిద్దరూ ఎదురుపడడం, హీరోయిన్ మంచి మనసు హీరోకి తెలిసి ప్రేమించడం, వెంటపడడం. హీరోయిన్ ఇంకెవరినో ప్రేమిస్తోందని తెలిసి ఆ ప్రేమని [...]
Full Story »నవల ఆధారిత సినిమాలు-5: గిరిజా కల్యాణం
తెలుగు నవలా సాహిత్యం లో పాపులర్ రీడింగ్ కు నాందీ పలికి రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి . పాఠకుల గుండెల్లో , గుండె లోతుల్లో మధురమైన భావాలను కలిగిస్తూ మధురానుభూతుల్ని మిగులుస్తూ ఆమె చేసిన రచనలు ఎన్నో . . . వాటిలోనిదే ఒక నవలారాజం ” గిరిజా కల్యాణం “ . అదేమిటో యద్దనపూడి నవలలో చాలావరకు , హీరో , హీరోయిన్లకు , ఒక బామ్మ నో లేదా అమ్మమ్మనో , లేదా తాతయ్యో [...]
Full Story »సింధూరం(1997) ఆడియో రివ్యూ!!!
పధ్నాలుగేళ్ళ క్రితం అంటే 1997 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా మనందరం స్వర్ణోత్సవాలు జరుపుకున్న సమయంలో విడుదలైంది ఈ ‘సింధూరం’ అనే సినిమా. ‘క్రియేటివ్ డైరెక్టర్’ అని అందరూ ముద్దుగా పిల్చుకునే దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించారు. తన కెరీర్ లోనే ఇప్పటి వరకూ తనకి అత్యంత సంతృప్తిని మిగిలించిన సినిమాగా ‘సింధూరం’ ని చెప్తుంటారు కృష్ణవంశీ. సమాజంలోని అసమానతలూ, అన్యాయాలూ చూసి భరించలేక [...]
Full Story »శంకరాభరణం
1979-80 లో వచ్చిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక చరిత్ర సృష్టించింది. మంచి చిత్రం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి జవాబుగా ఒక కొలమానంగా నిలిచింది. మంచి అభిరుచి ఉన్న నిర్మాత/లు (ఏడిద నాగేశ్వరరావు & ఆకాశం శ్రీరాములు-పూర్ణోదయ మూవీ క్రియేషన్స్) దొరికితే దర్శకుడు (కె.విశ్వనాధ్ ) ఏమి చెయ్యగలుగుతాడో ఎటువంటి కళాఖండాన్ని ప్రేక్షకులకి అందచేస్తాడో సూటిగా నిరూపించిన చిత్రం ఇది. ఈ చిత్రం ప్రభావంతో శాస్త్రీయ సంగీతం మీద మోజు పెరిగి తెలుగునాట [...]
Full Story »నాకు నచ్చిన మూడు తమిళ సినిమాలు!
యుద్దం సెయ్ – మిష్కిన్ దర్శకత్వంలో చేరన్ (నా ఆటోగ్రాఫ్ ఫేమ్) హీరోగా వచ్చిన సస్పెన్ థ్రిల్లర్/క్రైం థ్రిల్లర్. సమాజంలో కొందరు దౌర్భాగ్యులు చేస్తున్న అన్యాయాలకి అభాగ్యులు ఎలా బలి అయిపోతున్నారని చూపించే సినిమా. సమాజంలోని ఒక రకమైన చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే సినిమా. కథ విషయానికొస్తే, అనూహ్యంగా అమ్మాయిలు మాయమయిపోతుంటారు. కొందరు వ్యక్తులు కొన్ని రోజులుగా కనిపించకుండా పోతుంటారు. వారు కనిపించకుండా పోయినప్పటినిండీ ఓ 3-4 రోజుల వ్యవధిలో ఆ వ్యక్తుల శవాలు నగరంలోని [...]
Full Story »నవల ఆధారిత సినిమాలు: ముద్దుబిడ్డ
50 ల లో శరత్ నవలలను , నవల ల ఆధారం గా వచ్చిన సినిమాలను తెలుగు పాఠకులు /ప్రేక్షకులు బాగా ఆదరించారు . అందుకేనేమో అప్పుడు శరత్ బాబు నవల ల ఆధారం గా చాలా సినిమాలు వచ్చాయి . వాటిలోనిదే ఒకటైన “ బిందుగారబ్బాయి” నవల ఆధారంగా వచ్చిన ” ముద్దుబిడ్డ ” సినిమా/నవలను ఈ నెల పరిచయం చేస్తున్నాను . ముందుగా నవల గురించి : యాదవుడూ మాధవుడు సవితిబిడ్డలన్న సంగతి వారే [...]
Full Story »ఆకలిరాజ్యం(1981)
కొన్ని సినిమాలు వాటిని తీసిన కాలం నాటి దేశ పరిస్థితులను అద్దం పట్టి చూపిస్తాయి. 70లలోని దేశ రాజకీయ, కాల, సామాజిక పరిస్థితులకు ఒక అద్దం వంటి సినిమా “ఆకలిరాజ్యం”. 1980లో తమిళం లో “Varumayin Niram Sivappu” పేరుతో విడుదలైన ఈ సినిమాను తరువాత 1981లో తెలుగులో రీమేక్ చేసారు. నిరుద్యోగ సమస్య తారస్థాయిలో ఉన్న రోజులు అవి. ఎందరో చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో, పేదరికంతో, అవమానాలతో, నిస్పృహలతో కాలం వెళ్లదీసిన పరిస్థితులను [...]
Full Story »ముళ్ళపూడివారి జన్మదినం సంధర్భంగా ప్రత్యేక వ్యాసం
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురంకు చెందిన వారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం ఇబ్బందులలో పడిం ది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, [...]
Full Story »నవల ఆధారిత సినిమాలు: చండీప్రియ
పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” వకటి . ఇది ముక్కోణపు ప్రేమకథ . అంతే కాదు కథలో ఇంకోకోణము లో కూడా ప్రేమకథ వుంది . కాబట్టి ముక్కోణపు ప్రేమకథ అనలేము . నాలుగు కోణాల ప్రేమకథా ? ఏమిటీ అంతా గజిబిజి గా వుందా ? నవల చదువుతుంటే సాదా సీదా ప్రేమకథలాగే వుంటుంది . కాని హీరోకి ఓ రెండు ప్రేమ కథలు , , , హేరోయిన్ కు [...]
Full Story »గుండమ్మ కథ
విజయా వారి ఆణిముత్యాలలో ” గుండమ్మకథ ” కూడా ఒకటి . ఇది కుటుంబ కథా చిత్రము . దీనిలో హాస్యపుపాళ్ళు కూడా ఎక్కువే ! అప్పటి అగ్రశ్రేణి నటీ నటులు ఇందులో వున్నారు . హీరోలుగా యన్.టి రామారావు , ఏ. నాగేశ్వరరావు , హీరోయిన్లుగా సావిత్రి , జమున నటించారు . గుండమ్మగా సూర్యకాంతం జీవించింది . అగ్రశ్రేణి నటులు వున్నప్పటికినీ సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టటము గొప్ప వైవిధ్యం! [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు