జయం నుండి శ్రీఆంజనేయం వరకూ సున్నితమైనవి / లవర్ బోయ్ తరహా పాత్రలు ధరిస్తూ కొంతలో కొంత సక్సెస్ అవుతూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న నితిన్ ఆపై చాలామంది కుర్రహీరోల్లానే ఒక మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఫైట్లు గట్రాలతో మాస్ కథలతో తీసిన డజను చిత్రాలతో పరాజయాలనెదుర్కొని, నితిన్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఆమడదూరం పారిపోయేలా చేసుకున్నాడు. ఆతర్వాత మెల్లగా కళ్ళుతెరచి తిరిగి తనకు అచ్చొచ్చిన లవర్ బోయ్ రోల్ లో స్క్రీన్ ప్లేని నమ్ముకుని [...]
Full Story »లారెన్స్ ఆఫ్ అరేబియా (1957)
టీ.ఈ. లారెన్స్ అనే బ్రిటీష్ ఆర్మీ అధికారి చరిత్రనే Lawrence of Arabia గా 1957 లో తెరకెక్కించారు.యుద్ద కథల మీద వచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రెండవ ప్రపంచ యుద్ద ప్రభావం నుంచీ ప్రపంచం అప్పుడే కోలుకుంటూ ఉండటం, పశ్చిమ దేశాలకు పెద్దగా తెలియని మధ్యప్రాచ్యం యొక్క కథ కావడం ,సహజంగానే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలను కలిగించింది.అంతే కాక, ఏడు ఆస్కార్ అవార్డులు, ఐదు బ్రిటీష్ అకాడెమీ అవార్డులు, [...]
Full Story »Business Man నాకెందుకు నచ్చిందంటే..
This movie is strictly “A” Certificate movie and not for under 18. దూకుడు లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత మహేష్ నుండి అలాంటి సినిమానే ఆశిస్తూ పిల్లలు పెద్దలు ఉత్సాహంగా చూసేద్దామని ఎదురు చూస్తున్న టైంలో మహేష్ ఇలాంటి సినిమాను ఎన్నుకోవడం కొంచెం అభ్యంతరకరమైన విషయమే. స్టార్ ఇమేజ్ వచ్చాక నటులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది చిత్రాల ఎంపిక విషయంలో ఎలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నాం అనే విషయంపై శ్రద్ద [...]
Full Story »అదరని పెను ధైర్యమే పంజా !!
తనకి చిన్న వయసులో సాయం చేసిన ఓ డాన్ ఋణం తీర్చుకోడానికి తన స్వభావానికి విరుద్ధంగా అతని దళపతిగా ఎదిగి తనకి ఇష్టం లేని పనులు చేస్తూ తన ఇరవైఏళ్ళ జీవితాన్ని పణంగా పెట్టిన ఓ వ్యక్తి అన్నేళ్ళుగా తను అన్వేషిస్తున్న ప్రేమను చవిచూసిన తర్వాత తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలియ జెప్పే కథే పంజా. పవన్ లవర్ బోయ్ గా చేసిన తమ్ముడు, ఖుషీ, జల్సా లాంటి సినిమాలను ఆశించి [...]
Full Story »పిల్లజమిందార్
కష్టపడకుండా వారసత్వంగా వచ్చే సిరిసంపదలు తెచ్చిపెట్టిన అహంకారం (AKA బలుపు) తల నిండుగా ఎక్కించుకుని భూమికి పాతిక అడుగుల ఎత్తులో తప్ప నడవని ఓ కుర్రాడు తన తాత గారి కండిషన్స్ వలన తప్పనిసరిఐ నేలమీద నడవడం అలవాటు చేసుకుని, జీవితాన్ని మానవతా విలువలని అర్ధం చేసుకుని తనలోని మంచి మనిషిని కప్పి ఉంచిన అహంకారపు పొరలను ఛేదించుకుని పూర్తిమంచివాడుగా మారడమే ’పిల్ల జమిందార్’ కథ. ఈ కథ తెలుగు తెరకు కొత్తకాకపోయినా కామెడీ సెంటిమెంట్ సమపాళ్ళలో [...]
Full Story »నీదూకుడూ.. సాటెవ్వడూ..
((ఈ సమీక్ష కేవలం నా అభిప్రాయం మాత్రమే… రివ్యూలు చదవకుండా ఏవిధమైన అంచనాలు లేకుండా ఈ సినిమాను థియేటర్ లో చూడడం ఉత్తమం)) హైదరాబాద్ లో ప్రజలకోసం పాటుపడే నిజాయితీగల రాజకీయ నాయకుడు శంకరనారాయణ(ప్రకాష్ రాజ్). తన కొడుకు అజయ్ కూడా తన జనాలను తనలాగే కాపాడుకుంటూ ప్రజలకోసం బ్రతికితే చాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. అజయ్(మహేష్) పదేళ్ళ వయసులో ఉండగా ఒక ఊరికి వెళ్తున్న శంకర్నారాయణ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. తండ్రి [...]
Full Story »దూకుడు ఆడియో రివ్యూ
చాణ్ణాళ్ళ తర్వాత మహేష్ బాబు సినిమా వస్తోంది.. సహజంగా పెద్ద సినిమాలకు ఉండే హైప్ ఈ సినిమాకు కూడా ఉంది. ఇలాంటి టైం లో ఒక మంచి ఆడియో వస్తే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.. కానీ “అతడు”, “ఒక్కడు”, “పోకిరి” లాంటి సినిమాల ఆడియోలు దృష్టిలో పెట్టుకుని వాటి లాంటి ఆడియో ఇవ్వాలనే ఉద్దేశ్యం తో బాణిలు కట్టిన ఫీలింగ్ కలుగుతుంది.. తమన్ బాణీలు అందించిన ఈ సినిమా పాటలలో శ్రీను వైట్ల మార్కు ఏమాత్రం కనిపించలేదు. [...]
Full Story »ముందడుగు(1983)
సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం కె.బాపయ్య. మల్టిస్టారర్ సినిమాలే తెలుగు పరిశ్రమలో కరువైన ఈ రోజుల్లో ఇద్దరు పెద్ద హీరోలతో వచ్చిన ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పుకోవాలి. హీరోలకు ఇమేజ్ సమస్యలు అప్పట్లో లేవా అంటే బహుశా ఉన్నాయేమో అందుకనే నటీనటుల పేర్లు వేయకుండా “నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు” అని వేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణుల పేర్లు వేస్తారు. కానీ ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథ [...]
Full Story »మరణ మృదంగం (1988)
కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తే సినిమా ఎలా ఉంటుందో అని ఒక ఉత్కంఠ ఇంకొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే అది సూపర్ హిట్ అని ముందుగానే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు.. అలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమానే మరణ మృదంగం. చిరంజీవి-యండమూరి-కోదండరామిరెడ్డి ల కాంబినేషన్ లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా “మరణ మృదంగం” హీరోగా చిరంజీవి, హీరోయిన్లు రాధ, సుహాసిని.. ఇళయరాజ సంగీతం, యండమూరి కథ, కోదండరామిరెడ్డి దర్శకత్వం.. సినిమా హిట్ అవడానికి ఇంతకంటే మంచి [...]
Full Story »సింధూరం(1997) ఆడియో రివ్యూ!!!
పధ్నాలుగేళ్ళ క్రితం అంటే 1997 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా మనందరం స్వర్ణోత్సవాలు జరుపుకున్న సమయంలో విడుదలైంది ఈ ‘సింధూరం’ అనే సినిమా. ‘క్రియేటివ్ డైరెక్టర్’ అని అందరూ ముద్దుగా పిల్చుకునే దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించారు. తన కెరీర్ లోనే ఇప్పటి వరకూ తనకి అత్యంత సంతృప్తిని మిగిలించిన సినిమాగా ‘సింధూరం’ ని చెప్తుంటారు కృష్ణవంశీ. సమాజంలోని అసమానతలూ, అన్యాయాలూ చూసి భరించలేక [...]
Full Story »
తాజా వ్యాఖ్యలు