దూకుడు ఆడియో రివ్యూ

చాణ్ణాళ్ళ తర్వాత మహేష్ బాబు సినిమా వస్తోంది.. సహజంగా పెద్ద సినిమాలకు ఉండే హైప్ ఈ సినిమాకు కూడా ఉంది. ఇలాంటి టైం లో ఒక మంచి ఆడియో వస్తే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది..  కానీ “అతడు”, “ఒక్కడు”, “పోకిరి” లాంటి సినిమాల ఆడియోలు దృష్టిలో పెట్టుకుని వాటి లాంటి ఆడియో ఇవ్వాలనే ఉద్దేశ్యం తో బాణిలు కట్టిన ఫీలింగ్ కలుగుతుంది.. తమన్ బాణీలు అందించిన ఈ సినిమా పాటలలో శ్రీను వైట్ల మార్కు ఏమాత్రం కనిపించలేదు. [...]

Full Story »

ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా

పవన్‌కళ్యాణ్‌కీ సిరివెన్నెల గారికి మంచి సాన్నిహిత్యం వుందని, వాళ్ళిదరికీ వున్న తాత్విక చింతన, పవన్‌కళ్యాణ్‌కి సాహిత్యం పట్ల గల గౌరవం వాళ్ళిద్దరి స్నేహానికి కారణమని చాలా చోట్ల చదివాను. అందుకేనేమో వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు చాలా వరకు అర్ధవంతంగాను మంచి సాహిత్యవిలువలను కలిగివుంటాయి(అన్ని సినిమాలకీ పవన్‌కళ్యాణ్ దర్శకుడు కాకపోయిన పాటల సాహిత్యం చాలవరకు తనే దగ్గరుండి రాయించుకుంటారని కొన్ని ఇంటర్వ్యూల్లో చదివాను). పవన్‌కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన “జాని” సినిమాకోసం సిరివెన్నెలగారు రచించిన “ఏ చోట నువ్వున్నా [...]

Full Story »

ప్రియతమా నా హృదయమా

ప్రేమ అనేది ఒక మనిషి జీవితం లో ఎంత మార్పును తీసుకొస్తుందో అది మాటల్లో పేర్చి పాటగా కూరిస్తే ఇలా ఉంటుందేమో కదా .. ఆచార్య ఆత్రేయ గారు .. సరస్వతి దేవి ముద్దు బిడ్దేమో అనిపిస్తుంది .. లేకపోతె ఇంతటి సాహిత్యం సాధ్యమా .. ప్రేమని నిర్వంచించచ్చు .. ప్రేమని ఆస్వాదించచ్చు .. ప్రేమనే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు .. దానికి గాన గంధర్వుడి గాత్రం .. ఇళయరాజా స్వరం తోడైతే .. వినే వారికి [...]

Full Story »

వింటున్నావా .. వింటున్నావా ..!

తను ప్రేమించిన అమ్మాయి ఇంక తనకి దక్కదు .. అని  తెలిసి చివరి సారిగా  ఒక సారి చూసి వచ్చేద్దాం అని వెళ్ళిన అబ్బాయి ఉహకి అందనంతగా .. ఆ అమ్మాయి తన పెళ్లి ఆపేసి .. ఆ అబ్బాయి తనని కలవడానికి వచ్చినప్పుడు .. అన్ని రోజులుగా తన మనసులో ఉన్న మాట .. తన మీద ఉన్న ప్రేమని … చెప్పినప్పుడు .. వారిద్దరి మనసుల్లోను రేగిన ఒక అలజడి ఈ పాట నాకు చాలా నచ్చిన పాట .. ప్రియా [...]

Full Story »

మీర జాలగలడా నా యానతి..

ఈమద్య మా ఇంటి చుట్టుపక్కల ఎదో ఒక వ్రతమంటూ, వాయనాలు ఎక్కువయ్యాయి. అదీ ఎలాగంటే ఎదో పని మీద బయటకి వెళ్తుంటే, “ఎవండోయ్ ఒక్క నిముషం, మా అత్తగారు నందికేశ్వర స్వామి నోము.. తాంబూల తీసుకోడానికి రండి సాయంత్రం 5 లోపులో రావాలి అప్పటికి పూర్తయిపోవాలి” అంటూ .. ఈరోజు పొద్దున్న ఇంకో ఆవిడ, ఎవండోయ్ ఇదిగో.. ఈవిడ మా మేనకోడలు, పుష్పం- తాంబూలం, పండూ -తాంబూలం వ్రతం చేసుకుంది. ఇంకా 60 మందికి ఇవ్వాలి , [...]

Full Story »

ఛాంగురే ఛాంగు ఛాంగురే…

ఓహోహో… ఓహోహో… ఛాంగురే ఛాంగు ఛాంగురే… పల్లవి :ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే… అయ్యారే! నీకే మనసియ్యాలని ఉందిరా… పూర్తి పాట కోసం ఇక్కడ నొక్కండి _________________________________________________________ చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం (1966) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : టి.వి.రాజు గానం : జిక్కి చక్కటి శృంగారభరిత గీతం ఇది. ముఖ్యంగా. ఈ పాట శ్రీ కృష్ణ పాండవీయంలో భీముడికోసం పరితపిస్తూ….అతన్ని [...]

Full Story »

“మామ” తెలుగు టాప్-10..

మామ గా తెలుగువారికి సుపరిచితుడైన శ్రీ కే.వీ.మహదేవన్ గారు స్వరపరచిన పాటలలో టాప్-10 అంటూ చెప్పాలంటే ఏముంటాయి??  ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి జరిగిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.. నిను వీడని నీడను నేనే: ఒక ఆత్మ కు సంబంధించిన కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా రావడం అదే ప్రధమం అనుకుంటా.. అలాంటి అంతస్తులు సినిమా లో మహదేవన్ స్వరపరచిన ఈ పాట.. ఒక మైల్ స్టోన్  గా చిత్ర పరిశ్రమలో నిలిచిపొయింది..  తర్వాతి కాలంలో [...]

Full Story »

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME