కిశోర్ కుమార్ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సీరియస్ పాట

కిశోర్ కుమార్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే పాటలు “జిందగీ ఎక్ సఫర్ హైన్ సుహానా..”, “జై జై శివ్ శంకర్..” అలాంటి ఎనర్జెటిక్ పాటలు పాడే అవకాశం రావడంవెనుకఒకసీరియస్ పాట ఉంది. ఆ ఆట గురించి తెలిపేదే ఈ “టర్నింగ్ పాయింట్”.

కిశోర్ కుమార్ ను గాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమా “ఆరాధన” అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ “ఆరాధన”  లో అవకాశం రాకుంటే ఈ రోజు మనం కిశోర్ కుమార్ అనే లెజెండ్ సింగర్ ను చూడగలిగే వాళ్ళమా అన్నది ఒక పెద్ద ప్రశ్న. నటుడిగా,గాయకుడిగా ఒక వెలుగు వెలిగిన కిశోర్ కుమార్ వ్యక్తిగత జీవితం లో కలిగిన ఒడిదొడుకుల వల్ల కొంత కాలం కలిసి రాక మరికొంత సినీ పరిశ్రమతో దూరంగా కచేరిలు చేసుకుంటున్న తరుణం లొ “ఆరాధన” తో తన క్లాస్ ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.. కానీ ఆ “ఆరాధన” లో అవకాశం రావడనికి కారణమైన ఒక పాట గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు..  ఆ పాటే “పంథీ హూ మై ఉస్ పథ్ కా”!

“దూర్ గగన్ కీ చావోం మే” తీసిన ఏడేళ్ళకు కిశోర్ కుమార్ “దూర్ కా రాహీ” అనే సినిమా ఇంకోటి తీశాడు..  ఈ సినిమాకు విడుదలకు చాలాముందే పాటలు తయారయ్యాయి.. ఆ సినిమా కోసం కిశోర్ తయారు చేసుకున్న “పంథీ హూ మై ఉస్ పథ్ కా” ట్యూన్ రవీంద్రనాథ్ టాగూర్ పాట నుండీ తీసుకున్నది. . అప్పటికే “చారులత” అనే బెంగాలీ సినిమాలో కిశోర్ ఒక రవీంద్రుని పాట పడటం వల్ల మరోసారి ఇది ట్రై చేశాడు.. ఒకసారి బర్మన్ ఇంట్లో జరిగిన పార్టీలో కిశోర్ ఆయనకు “పంథీ హూ మై ఉస్ పథ్ కా” పాట పాడి వినిపించాడు..అంతే! వెంటనే బర్మన్ నిర్ణయించాడు.. కిశోర్ చేత దేవ్ ఆనంద్ కు తప్ప వేరేవాళ్ళకు పాడననే నియమాన్ని సడలింప చేశాడు.. ఆ తర్వాత జరిగిందంతా చరిత్రే..

కొసమెరుపు ఏమిటంటే “దూర్ కా రాహీ” ఘోరంగా ఫ్లాపయ్యింది.. ఎంతగా అంటే కిశోర్ మళ్ళీ సీరియస్ సినిమాల గురించి ఆలోచించలేనంతగా..

పంథీ హూ మైన్ ఉస్ పథ్ కా యూ ట్యూబ్ వీడియో:


ఆధార:
1.వీకీపీడీయా
2.కిశోర్ జీవన్ ఝురి, యెమ్మెస్.స్వాతి, హాసం ఫిబ్రవరి16,2003.

టర్నింగ్ పాయింట్1

సాంఘిక చిత్ర మణి దీపం అక్కినేని దేవదాసు!

కొన్ని పాత్రల పేర్లు చెబుతూనే కొందరు నటులు జ్ఞప్తికి రావడం, కొందరు నటుల గురించి అనుకుంటే కొన్ని పాత్రలు గుర్తుకురావడం తరచూ జరుగుతుంటుంది.. ఆ కోవలోకే వచ్చే కాంబినేషన్ “అక్కినేని – దేవదాసు” అక్కినేనిని సాంఘిక హీరో గా నిలబెట్టిన దేవదాసు గురించి కొన్ని విశేషాలు.. “దేవదాసు”  ఇప్పటి వరకూ ఒకే కథ మీద 10 సినిమాలు వచ్చిన ఏకైక కథ దేవదాసు మాత్రమేనంటే అతిశయోక్తి కాదు. 1935 నుంచీ 2002 వరకూ వివిధ భాషలలో పదిసినిమాలు [...]

November 2, 2010 0
Page 14 of 14« First...«1011121314

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME