తాప్సీ వర్సెస్ కాజల్

గత దశాబ్దకాలంగా తెలుగు సినిమా లో హీరోయిన్ కు నటించే అవకాశం ఉన్న సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టోచ్చు.. ఇలాంటి సమయం లో హీరోయిన్ల మధ్య పోటీ గురించి మాట్లాడటం అంటే కొంచెం అతిశయోక్తే..   సౌందర్య తర్వాత తెలుగు పరిశ్రమలో నటించగల హీరోయిన్లు రాలేదన్నది మింగుడు పడని చేదు నిజం.. కానీ మొన్న మిష్టర్ పర్ఫెక్ట్ సినిమా లో కాజల్ నటన చూశాక మళ్ళీ నటించగల హీరోయిన్ అన్న ధైర్యం కలిగింది.. అదే సినిమాలో తాప్సీ ఉన్నా కాజల్ ముందు సెకండ్ హీరోయిన్ కంటే అధ్వానంగా కనిపించింది.. ఇక ఈ టపా రాస్తున్న  ముఖ్య ఉద్దేశ్యమేమంటే ఈ వారం విడుదల అవబోయే “వీర” సినిమాలో కాజల్ పాత్ర ఆకట్టుకుంటుందా లేక తాప్సీ ఆకట్టుకుంటుందా?? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం..  ఒక వైపు కాజల్ అందం తో పాటూ నటనలో కూడా మంచి మార్కులు కొట్టేస్తుంటే మరో వైపు తాప్సీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తన తెలుగు కెరీర్ గ్రాఫ్ ని పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తోంది.. కనుక ఈ సమయం లో వస్తున్న వీర లో కాజల్, తాప్సీలలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయంటారు??

నాకు తెలిసినంతవరకూ ఈ ఏడాది తాప్సీ, కాజల్ లలో ఎవరికి ఎక్కువ హిట్లు వస్తాయో వాళ్ళు తెలుగు పరిశ్రమ లో ఎక్కువ  కాలం నెం. 1 హీరోయిన్ గా నిలబడే అవకాశం ఉంది.. ఎందుకంటే, మరో ముఖ్య పోటీదారు ఇలియానా కెరీర్ ప్రస్తుతం అనేక వివాదాల్లో ఇరుక్కుని ప్రస్నార్థకంగా ఉంది.. మరో వైపు జెనీలియా హిందీ పరిశ్రమ పై ఎక్కువ ఆసాక్తి గా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇంక మిగిలిన హీరోయిన్లందరూ 2,3 సినిమాలకంటే ఎక్కువ సినిమాలో నటించే పరిస్థితి కనిపించడం లేదు..

రేపటి వరకూ వచ్చే అభిప్రాయాలు తీసుకుని ఈ టపా అప్డేట్ చేస్తా.. కనుక మీ అందరు ఈ విషయం పై మీ అభిప్రాయాలు తెలపమని మనవి..

సినిమా3

Source code – సోర్స్ కోడ్ ..

నిన్న చూసిన సినిమా .. కొంచెం లాజికల్ .. గా .. కొంచెం ఇంటరెస్టింగ్ గా .. ఉంది .. inception  అంత లాజిక్స్ లేవు కాని .. నా బుజ్జి బుర్రకి అర్ధంయ్యేంత బుజ్జి లాజిక్ తో ఉంది .. ట్రైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది  .. హీరో ట్రైన్ లో సడన్ గా నిద్రలోంచి లేస్తాడు .. అతనికి ఏమి అర్ధం కాదు .. ఎక్కడ ఉన్నాడు .. ఏమి చేస్తున్నాడు అని .. [...]

May 9, 2011 9
కలగూరగంప4

100% Love… 100% Entertainment

ఆర్య2 తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మగధీర లాంటి మెగాహిట్  తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన వినోదాత్మక ప్రేమకధా చిత్రం… “100% లవ్”. హిట్, ప్లాప్ అన్నది పక్కన పెడితే సుకుమార్ తీసిన ప్రతీ సినిమా కొత్త కధ తో, మాంచి డైలాగ్స్, కామెడీ, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ తొ, అదిరిపోయే మ్యూజిక్ తో ఉంటాయన్నది తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంది. సూక్ష్మంగా  ఒక్కముక్కలో కధ  చెప్పాలీ [...]

May 8, 2011 21
మిక్స్ మసాలా5

అమేరికన్లపై ఒసామా అనుచరుల ప్రతీకారం

ఇంతకు ముందు బిన్ లాదెన్ ను శోభన్ బాబు వీడియోతో అమేరికన్లు ఎలా చంపారో చూశాం కదా. ఇప్పుడు ఇది లాదెన్ అనుచరుల ప్రతీకారం – సూపర్స్టార్ కృష్ణ – We didn’t start the fire వీడియోతో

May 6, 2011 1
మిక్స్ మసాలా6

ఒసామా బిన్ లాదెన్ మరణానికి అసలు కారణం

అమేరికన్ సేనలు బలవంతంగా చూపించిన ఈ వీడియో చూసి ఒసామా ఆత్మహత్య చేసుకున్నాడని అభిజ్ఞ వర్గాల భోగట్టా!

May 3, 2011 2
సమీక్ష9

మిష్టర్ పర్‌ఫెక్ట్ ఎందుకు బాగుంది??

రాజ్‌కుమార్ రాసిన సమీక్ష చదివి ఈ సినిమా చూడటానికి మా ఫ్రెండును తీసుకుని వెళ్ళాను.. ప్రభాస్ సినిమా అంటే ఫైట్లు ఎక్కువగా ఉంటాయేమో అని మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉంది.. కానీ మొదటి గంటలోనే అర్థం అయ్యింది.. యాక్షన్ హీరో అనేముద్ర నుంచీ బయటపడటానికి ప్రభాస్ చేసిన మరో ప్రయత్నమే ఈ సినిమా (“డార్లింగ్” మొదటి ప్రయత్నం).. ఎక్కడా చంపడాలు నరకడాలు లేవు.. సాఫీగా హీరో హీరోయిన్ల మధ్య జరిగే స్వీట్ నథింగ్స్ తో మొదటి భాగం [...]

April 25, 2011 21
Page 5 of 14« First...«34567»10...Last »

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME