The Sound of Music(1965)

ఈ వ్యాస రచయిత్రి బ్లాగర్ తృష్ణ గారు.

  

సినిమాను అర్ధం చేసుకుని, ఆస్వాదించేంత ఊహ వచ్చాక నేను థియేటర్ లో చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా “The Sound of Music”. ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాలో ఒకటి. 1965లో “38వ ఆస్కార్ బెస్ట్ పిక్చర్”గా అవార్డ్ అందుకున్న ఈ సంగీతభరితమైన చిత్రం ఏభైఏళ్ల తరువాత కూడా సినీసంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. 1959లో అప్పటి ప్రముఖ సంగీతరూపకకర్తలైన Richards Rodgers మరియు Oscar hammerstein II బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం సంయుక్తంగా రచించిన సంగీతరూపకం The Sound of Music. “జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్” అనే మిలిటరీ కేప్టెన్ జీవిత కథ ఈ సంగీతరూపకానికి ఆధారం. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ సంగీతరూపకాన్ని 1965లో Robert Wise తానే దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి సినిమాగా తీసి 20th century fox ద్వారా విడుదల చేసారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తూ ఈ సినిమా అఖండ విజయాన్ని చవిచూసి కాసుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ ప్రఖ్యాతిని సంపాదించుకున్న ఈ సినిమా వందేళ్ళ ప్రపంచసినీ చరిత్రలో నూరు గొప్పచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. “వన్ ఆఫ్ థ బెస్ట్ మ్యూజికల్స్ ఎవర్ మేడ్” అనిపించుకుంది.   

దక్షిణ జర్మనీ కి చెందిన ఆస్ట్రియాలోని “సాజ్బర్గ్” అనే పట్టణంలోని “వోన్ ట్రాప్” అనే మిలిటరీ కెప్టెన్ జీవితకథ The Sound of Music చిత్ర కథకు ఆధారం. ఆస్ట్రియన్ నేవీ నుండి రిటైరైన కమాండర్ జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్. భార్యను పోగొట్టుకున్న అతనికి ఏడుగురు సంతానం. ఆర్మీ కెప్టెన్ కావటం వల్ల పిల్లలను కూడా క్రమశిక్షణతో కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటాడు. అయితే అతని కట్టుదిట్టమైన పెంపకం ఇష్టంలేక అల్లరిగా తయారైన అతని ఏడుగురు పిల్లలను చూసుకోవటానికి కెప్టెన్ తీసుకువచ్చే గవర్నెస్ లు ఎవ్వరూ ఆ పిల్లల అల్లరిని భరించలేక పారిపోతూ ఉంటారు. కొత్త గవర్నెస్ కోసం ఒక మొనాస్ట్రీ లోని మదర్ కు లెటర్ పంపుతాడు కెప్టెన్.   

నన్ గా మారటానికి ఆ మొనేస్ట్రీ లో చేరుతుంది మరియా. కానీ అక్కడి కట్టుబాట్లతో ఇమడలేకపోతూ ఉంటుంది. అమెదొక స్వేచ్ఛా ప్రపంచం. ఆమె మనసుని అర్ధం చేసుకున్న మదర్ మార్పు కోసం ఆమెను కెప్టెన్ ఇంటికి కొత్త గవర్నెస్ గా పంపిస్తుంది. అక్కడ పిల్లలు ఆమెను బెదరగొట్టడానికి పెట్టే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. నెమ్మదిగా తన సంగీతంతో, వాత్సల్యంతో పిల్లలకు దగ్గరౌతుంది మరియా. వారిలో ఒకరిగా కలిసిపోయి కెప్టెన్ నియమించిన రూల్స్ అన్నింటినీ మార్చేసి, పిల్లలకు స్వేచ్ఛాపూరిత ప్రపంచాన్ని చూపిస్తుంది మరియా. ఆమెలో మాతృత్వ వాత్సల్యంతో పాటూ తాము ఎన్నడూ చూడని సరదాలను, కొత్త అనుభూతులను చవిచూస్తారు పిల్లలు. ఆమె వల్లనే పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారని మరియాను మందలిస్తాడు కెప్టెన్. అయితే ఆమెలోని చలాకీతనానికీ, సంగీత పరిజ్ఞానానికీ అతడు ముగ్ధుడౌతాడు. ఎల్సా తో ఎంగేజ్మెంట్ అవబోతున్న కెప్టెన్ పై తన మనసు మళ్ళుతోందని అర్ధమైన మరియా అది నన్ గా మారాలనుకుంటున్న తన నిర్ణయానికి విరుధ్ధమని భావించి ఇల్లు విడిచి తిరిగి మొనాస్ట్రీకు వెళ్పోతుంది.   

మరియా వెళ్పోయాక తన మనోభావాలను స్పష్టం చేసుకున్న కెప్టెన్ తాను ఎల్సాకు తాను మరియాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటాడు. మరియా కోసం మొనాస్ట్రీ కు వెళ్తాడు కెప్టెన్. మనసు చలించే చోటికి తానిక వెళ్లనని అంటుంది మరియా. కానీ మదర్ బలవంతం మీద కొత్త గవర్నెస్ వచ్చేదాకా ఉండటానికి ఒప్పుకుని బయల్దేరుతుంది. కెప్టెన్ ఆమెను పెళ్ళికి ఒప్పించగలుగుతాడా? ఆర్మీ నుంచి వచ్చిన పిలుపును తప్పించుకోవటానికి కెప్టెన్ ఏం చేసాడు? సజ్బర్గ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వోన్ ట్రాప్ కుటుంబం పాల్గొనగలిగారా? నాజీ ఆర్మీ నుంచి తప్పించుకుని ఆ కుటుంబం ఎలా ఆస్ట్రియా దాటివెళ్తారు అన్నది మిగిలిన కథ.   

కొన్ని సన్నివేశాల తాలూకూ యూట్యూబ్ వీడియో ఇక్కడ   

సినిమలో ప్రధాన ఆకర్షణ సంగీతం. 1959లో Richards Rodgers మరియు Oscar hammerstein II సంయుక్తంగా బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం రూపొందించిన సంగీతరూపకం The Sound of Musicలోని పాటల బాణీలనే సినిమాలో కూడా వాడుకున్నారు. అయితే సినిమా రిలీజయ్యే సమయానికి hammerstein చనిపోవటంతో మరో రెండు పాటలను చిత్రం కోసం Rodgers తానే రాసి బాణీ కట్టారు. టైటిల్ సాంగ్ “With songs they have sung for a thousand years, The hills fill my heart with the sound of music, My heart wants to sing every song it hears, The hills are alive with the sound of music”,వెస్ట్రన్ సంగీత స్వరాలను వర్ణించే   ”Doe, a deer, a female deer   Ray, a drop of golden sun Me, a name I call myself  Far, a long, long way to run  Sew, a needle pulling thread”,  

మరియా ఫేవరేట్ థింగ్స్  
 

 

 ”Raindrops on roses and whiskers on kittens  

 Bright copper kettles and warm woolen mittens  

Brown paper packages tied up with strings  

These are a few of my favorite things”    

మదర్ ఎబెస్ పాడే  ”Climb every mountain, Search high and low, Follow every byway, Every path you know”,    

కెప్టెన్ ప్రేమని తెలిపినప్పుడు మరియా పాడే “Perhaps I had a miserable youth, But somwhere in my wicked, miserable past, There must have been a moment of truth,For here you are, standing there, loving me; Whether or not you should, So somewhere in my youth or childhood, I must have done something good, Perhaps I had a wicked childhood”,   

 ఇంకా  ”i am sixteen going on seventeen”, “Edelweiss” మొదలైన అన్ని పాటలు కూడా సంగీతం, సాహిత్యం రెండింటిలోనూ వేటికవే సాటి. ఈ సినిమా కథ ఇన్స్పిరేషన్ తో పాతిక ఆంగ్లేతరభాషల్లో మరో పాతిక సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో శాంతినిలయం(1969), తరువాత తీసిన “రావుగారిల్లు” సినిమా, రాజా చిన్ని రోజా(ఇది డబ్బింగ్ సినిమా అనుకుంటా), హిందీలో గుల్జార్ తీసిన “పరిచయ్”(ఇందులో టీచర్ జీతేంద్ర . అంతే తేడా) మొదలైన సినిమాలకు Sound of Music సినిమా కథే ఆధారం. ఇళయరాజా, రెహ్మాన్ కూడా ఈ పాటల బాణిలను తమ సొంత బాణిలల్లో వాడుకున్నారు.   1965లో ఐదు ఆస్కార్లు గెలుచుకున్న ఈ సినిమా మరెన్నో చోట్ల నామినేషన్లు, ప్రశంసలు పొందింది. సినిమాలో కెప్టెన్ గా “క్రిష్టఫర్ ప్లమ్మర్” నటించారు. మదర్ ఎబెస్ గా “పెగ్గి వుడ్” నటించారు. మరియాగా నటించిన “జూలీ ఏండ్రూస్” సినిమాలో పాటలు స్వయంగా పాడిన గాయని కూడా కావటంతో సినిమాకు జూలీ ఏండ్రూస్ సగం ప్రాణం. Ted D.McCord చేసిన సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా ఉంటుంది. అప్పట్లోనే 70mm లో తీసిన ఈ చిత్రంలోని లొకేషనల్ అందాలు మనసు దోస్తాయి. సినిమా మొదట్లో స్క్రీనంతా నిండుకున్నట్లున్న పచ్చని కొండలు, గ్రీనరీ నుంచీ సినిమా చివర్లో కనిపించే ఆల్ఫ్ మంచు కొండలు వరకూ ప్రతి ఫ్రేమ్ అందమైనదే. చాలా సార్లు సినిమా చూసి ఉండటంతో పాటల సాహిత్యం అంతా కంఠతా నాకు. ముఖ్యంగా “Do-Re-Mi”, “My favourite Things” నాకు చాలా ఇష్టమైన పాటలు. ఒక యదార్ధ జీవితకథ, చక్కని పాటలు, పాత్రలలో కనిపించే రకరకాల భావోద్వేగాలు,గుర్తుండిపోయే సన్నివేశాలతో ఈ సినిమా చూసిన ప్రతివారికీ తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం. సినీప్రేమికులందరూ తప్పక కొని దాచుకోవాల్సిన మంచి సినిమా. ఈ సినిమాలోని పాటల బిట్స్ క్రింద చూడండి.    

 

    
 

 

 

   -తృష్ణ

 

About trishnaventa

has wrote 2 articles on this blog.

Article by trishnaventa

Authors bio is coming up shortly.

10 Responses to The Sound of Music(1965)

  1. Have heard a lot about this movie, and also had it in my recent collection. Gotta watchitt! Thanks for the nice review. Will comment again after watching the movie

  2. నేనూ ఈ సినిమా గురించి చాలా సార్లు విన్నాను కానీ ఇంతవరకూ చూడలేదండి. వ్యాసం బాగుంది చూడటానికి ప్రయత్నిస్తాను.

  3. Mahek says:

    బాగా రాసారు తృష్ణ. నాక్కూడా చాలా ఇష్టమైన మూవీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి 45 సంవత్సరాలైన సందర్భంలో యాక్టర్స్ అందరూ ఓప్రా షోకి, NBC,CBS లో కొన్ని షోస్ కి వచ్చారు.
    నిరీక్షణ మూవీలోని “తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట” పాట మ్యూజిక్ “మై ఫేవరట్ థింగ్స్” music ఒకేలాగే ఉంటుంది.
    శాంతినివాసం…..ష్యూర్?
    Wild geese that fly with a moon on their wings
    Snowflakes that stay on my nose and eyelashes
    Silver white winters that melt into springs
    These are a few of my favorite things :)

    • That’s really great…feeling like singing with you..!!

      ఇళాయరాజా మూడు సినిమాల్లో ఈ ట్యూన్స్ వాడుకున్నారని ఎక్కడో చదివానండీ.
      ‘శాంతి నిలయం’ అండీ (‘శాంతినివాసం’ వేరే సినిమా)

      Thankyou.

  4. Som says:

    Very nice review. Have to say i didn’t know much about the movie earlier but your review is enticing me to watch the movie ASAP. I will do that. Keep more such reviews flowing from your pen.

  5. kiran kumar T says:

    Chaala Bagundi. Kaani meeru mana Telugu cinemala guurchi rasthe baagintundi. Manchi cinema gurchi rayadam manchide, kaani mana Oka sametha gurthunchukovali. “Inta gelichi rachcha gelavali.”. Naaku aa OSCAR movies ante istame, naa vadda anni Osavar Movies unnai.
    Kaani nenu cheppedi emitante, mundu mana telugu cinemala gurchi cheppandi, paatha cinemalani Kaapadandi. Konni maruguna paduthunnai. Please provide one source for all OLD telugu movie. Please please..any body please try………..

    • @కిరణ్ గారూ, వ్యాసం బాగుందన్నందుకు ధన్యవాదాలు. కానీ ఇది నా పదవ ఆంగ్ల చిత్ర వ్యాసం కాదండి. ఈ వెబ్సైట్లో ఇదే మొదటిది. నా సినిమా బ్లాగ్లో(http://maacinemapegi.blogspot.com) కూడా నేను ఆంగ్ల చిత్రాల గురించి మాత్రమే రాయనండీ. నా మనసుకు ఇది బాగుంది, ఈ సినిమా గురించి నలుగురికీ చెప్పాలి అని తోచినదాని గురించి రాస్తాను. అది హిందీనా, తెలుగు దా, ఆస్కార్ మూవీనా అని చూడను. మీకు ఓపిక ఉంటే నా సినిమా బ్లాగ్లో నేను రాసిన మన తెలుగు సినిమాల వ్యాసాలు కూడా చూడవచ్చు. ఒక్క ఇంగ్లీష్ సినిమా గురించి రాసినంత మాత్రాన తెలుగు సినిమాలపై గౌరవమో, ఇష్టమో లేదనుకోకూడదని నా అభిప్రాయమండీ.

    • karthik says:

      కిరణ్ గారూ, మీరు చెప్పినట్టు పాత సినిమాల గురించిన విశేషాలను తేవడానికి ప్రయత్నిస్తున్నాము.. అనివార్య కారణాల వల్ల లేట్ అవుతున్నాయి.. త్వరలో పాత తెలుగు సినిమాల గురించి ఒక సెక్షన్ పెట్టాలని అనుకుంటున్నాము..

  6. SR_Rao says:

    తృష్ణ గారూ !

    ‘ Sound of Music ‘ వ్యాసం గురించి చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను మన్నించండి. నిజం చెప్పాలంటే ఈ వ్యాసం మళ్ళీ మీ నాన్నగారిని గుర్తు చేసింది. ఆయన సంగీత పరిజ్ఞానం, దానిపైన ఆయనకున్న మక్కువ, ఆయనలో వున్న విశ్లేషణ మళ్ళీ మీ వ్యాసంలో చూసాను. ముఖ్యంగా ఆయన ఈ చిత్ర సంగీతం గురించి కార్యక్రమాలలో ప్రస్తావించడం నాకు తెలుసు. రేడియో రామం గారి వారసురాలిగా మీకు అభినందనలు.

  7. ఈ వ్యాసానికి స్పందింఛిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు.

    -తృష్ణ.

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Subscribe without commenting

ఎన్నుకోబడ్డ వీడియోలు

Powered By Indic IME